మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం…

మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం…
- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
మోత్కూర్, ఆంధ్రప్రభ : మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని,కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మహిళల పేరిట అమలు చేస్తూ మహిళా పక్షపాతిగా కొనసాగుతున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.సోమవారం మండలంలోని దాచారం గ్రామంలో రూ.10 లక్షల (ఎన్ ఆర్ ఈ జి ఎస్) నిధులతో చేపట్లనున్న గ్రామ మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్వయంగా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్ ,ఇందిరమ్మ క్యాంటీన్లకు ఓనర్లు చేయడంతో పాటు సోలార్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాల సబ్యులకు అప్పగించామన్నారు.మహిళల ఆర్థికాభివృద్ధి కై ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డుతో పాటు మరో 15 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించారు. దాచారం నుండి పొడిచేడు వరకు బి టి రోడ్డు పనులు సైతం చేపడుతామని హామీ ఇచ్చారు.
జడ్పీహెచ్ ఎస్ పాఠశాల లో సీసీ కెమెరాల ప్రారంభం…
మండలంలోని దాచారం జడ్పీహెచ్ ఎస్ పాఠశాల లో సర్పంచ్ కర్నె జ్యోతి వీరేశం స్వంత నిధులు రూ.30 వేలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే సామెల్ స్వయంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్నె జ్యోతి వీరేశం, ఉపసర్పంచ్ భీమన బోయిన అయిలయ్య, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, తహశీల్దార్ జ్యోతి, పంచాయతీ రాజ్ ఏ ఈ శివ, మాజీ సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ ఎం వెంకటేష్, స్థానికులు అయిలయ్య, బొనుగ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
