విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆత్రం దత్తు అన్నారు. శనివారం ఆ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజు పాఠశాలలకు పంపించాలని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పాఠశాలలో హాజరు శాతం తగ్గకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని దానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. తమ పిల్లల చదువులపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారికి ఉన్నత చదువులు చదివించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు సునీత, కవిత, సన్న విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
