Ahobilam | కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్…

Ahobilam | కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్…

  • ఇక క‌ఠిన చ‌ర్య‌లే…

Ahobilam | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా లో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ డీఎస్పీ కొలికెపూడి ప్రమోద్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీసునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు ఈ రోజు అహోబిలంలో ఆళ్లగడ్డ డీఎస్పి ప్రమోద్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్ లోని సుమారు 50 మంది సబ్ డివిజన్ అధికారులు, సిబ్బందితో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో మొత్తం 284 మద్యం బాటిల్లను, 8 మంది వ్యక్తుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 247 విస్కీ బాటిల్స్, 37 బీర్ బాటిల్స్ లభించాయన్నారు. అదనంగా ముఖ్య ప్రదేశాలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, నేర చరిత్ర గలవారు, అనుమానితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ మాట్లాడుతూ ఆహోబిలం ఒక ప్రతిష్ఠాత్మక పుణ్యక్షేత్రం అని, ఇక్కడ అక్రమ మద్యం విక్రయాలు, నాటు సారా, రౌడీయిజం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సహించబోమని తెలిపారు.

Ahobilam |

ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో ఆళ్లగడ్డ రూరల్ సీ ఐ బి.వి. రమణ, ఆళ్లగడ్డ ఉయ్యలవాడ చాగలమర్రి ఆళ్లగడ్డ టౌన్ ఎస్ ఐలు వరప్రసాద్, రామిరెడ్డి, రాజారెడ్డి, పీరయ్య, జయప్పలు పాల్గొన్నారు.

Leave a Reply