3 Lady Dons : వీళ్లే మాఫియా మా రాణులు Andhra Prabha Crime Story

3 Lady Dons : వీళ్లే మాఫియా మా రాణులు Andhra Prabha Crime Story
ఒకరు హాలాహలం
మరొకరు రివాల్వర్ రాణి
ఇంకొకరు కలెక్షన్ క్వీన్
గ్యాంగ్ స్టర్ బిష్టోయ్ అండర్ వరల్డ్ కీ రోల్స్
( ఆంధ్రప్రభ, నెట్ వర్క్ క్రైమ్ స్టోరీ)
3 Lady Dons : అంతర్జాతీయ మాఫియా సామ్రాట్ దావూడ్ ఇబ్రహీం కస్కర్ శకం ముగిసింది. ఇప్పడు పంజాబీ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇందులో మహిళ మణులు మేము సైతం అంటూ.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు.
తాజాగా ఢిల్లీ పోలీసులు మరో కీలక లేడీ డాన్ ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహా ను అరెస్టు చేశారు. ఆమెతో పాటు గ్యాంగ్‌స్టర్ బాబీ కబూతర్ అలియాస్ మహఫూజ్ , మరో ఇద్దరు సహచరులు మొహమ్మద్ రాజీ ఖాన్, షాబాజ్ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఫిబ్రవరి 19, 2026న ఢిల్లీలోని మహిపాల్పూర్ ఫ్లైఓవర్ సమీపంలో వీరిని చాకచక్యంగా పట్టుకున్నారు.

ఈ ఘటనతో.. లారెన్స్ మాఫియా సామ్రాజ్యంలో ముగ్గురు కీలక లేడీ డాన్ లు ఏ రీతిలో అవతరించారో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. లారెన్స్ బిష్ణోయ్ అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని ఈ 3 లేడీ డాన్ లు ఎంత పకడ్పంధీగా నడుపుతున్నారో NIA తన ఛార్జిషీట్ లో వ్యక్తం చేసింది. వీరు కేవలం సహకరించడమే కాకుండా, స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగారని NIA పేర్కొంది. ఈ ముగ్గురు మాఫియా మాహిష్మతీలు కథల్లో ఎన్నో కీలక మలుపులు తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. నేరసామ్రాజ్యంలో వీరి యంత్రాంగం, మంత్రాంగం ఓ సారి తెలుసుకుందాం.
3 Lady Dons : ఈ ముగ్గురు మహిళ మణులు .. వృత్తి రీత్యా అతి సామాన్యులే. కానీ ఒక్క్కొక్కరూ ఒక్కొ క అంశంలో ప్రావీణ్యులు. ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహా ఈమె ముద్దు పేరు మేడమ్ జెహర్ అంటే విష వధువు .. డ్రగ్స్ నెట్వర్క్ నిర్వహణలో సిద్ధ హస్తురాలు. రాజస్థానీ రాణి అనురాధ చౌదరి . ఈమె ముద్దు పేరు మేడమ్ మింజ్. బిష్ణోయ్ గ్యాంగ్‌లో అత్యంత ప్రమాదకారి. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో గ్రాడ్యుయేట్. ఒకప్పుడు షేర్ మార్కెట్లో పనిచేసింది.

గ్యాంగ్ ఆర్థిక వ్యవహారాలు , వ్యూహరచనలో సిద్ధహస్తురాలు. ఇక మూడో లేడీ డాన్ పూజా సైనీ. ఈమె సాధారణ గృహిణి. కానీ జైపూర్ కాల్పుల కేసులో ఈమె పేరు బయటపడింది. ఈమె ఒక లాజిస్టిక్ సపోర్టర్. గ్యాంగ్ షూటర్లకు ఆయుధాలు సరఫరా చేయడం, నకిలీ గుర్తింపు కార్డులు తయారు చేయడంలో నిపుణురాలు. వీరందరూ విద్యావంతులే. బ్యూటీ పార్లర్, షేర్ మార్కెట్, గృఫిణి ముసుగులో పోలీసుల కళ్లు గప్పి గ్యాంగ్ స్టార్లుగా ఎదిగారు. నేర సామ్రాజ్యంలో మగాళ్లకు ధీటుగా ప్లానింగ్, మనీ లాండరింగ్ , వెఫన్స్ లాజిస్టిక్స్ వింగ్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురు నేరప్రస్థానం తెలుసుకుందాం.
3 Lady Dons : మేడమ్ జెహార్ అలియాస్ నేహ

ఇప్పటి వరకూ ఆమె, ఈశాన్య ఢిల్లీలో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్న సాదాసీదా మహిళ. కారీ,, అమె అపాధ్యురాలు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లో డ్రగ్స్ నెట్వర్క్ క్వీన్ ఆమె ఎవరో కాదు, డిల్లీ పోలీసుల వలలో చిక్కుకున్న ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహా అలియాస్ మేడమ్ జెహర్ . తన దీర్ఘకాలిక భాగస్వామి గ్యాంగ్‌స్టర్ బాబీ కబూతర్ అలియాస్ మహఫూజ్ , మరో ఇద్దరు సహచరులు మొహమ్మద్ రాజీ ఖాన్, షాబాజ్ సహా పోలీసులకు దొరికిపోయింది. గురుగ్రామ్‌లోని ఒక మాల్లో షాపింగ్ ముగించుకుని SUV వాహనంలో తిరిగి వస్తుండగా, మహిపాల్పూర్ ఫ్లైఓవర్ సమీపంలో పోలీసులు వీరిని అడ్డుకుని పట్టుకున్నారు. నేహా, బాబీ కబూతర్ గత ఏడేళ్లుగా కలిసి పనిచేస్తున్నారు.

బాబీ పరారీలో ఉన్న సమయంలో ఆమె అతనికి ఆశ్రయం కల్పించడమే కాకుండా, గ్యాంగ్ సభ్యులతో కమ్యూనికేషన్ నిర్వహించేది. బాబీ కబూతర్ కు అంతర్జాతీయ ఆయుధ స్మగ్లర్ సలీం పిస్టల్ నుంచి తుపాకులను సేకరించి బిష్ణోయ్ గ్యాంగ్‌కు సరఫరా చేసేవాడు. గ్యాంగ్ సరఫరా చేసిన ఆయుధాలను సిద్ధూ మూసేవాలా హత్య, నటి దిశా పటాని ఇంటి వెలుపల కాల్పులు, మరియు ఢిల్లీలోని నాదిర్ షా హత్య వంటి కేసుల్లో ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్లాన్లన్నీ అమలులో ఉన్నప్పుడు, నిందితులకు సురక్షితమైన ప్రదేశాల్లో ఆశ్రయం కల్పించడంలో నేహా సహాయపడింది. ఆమె తన బ్యూటీ పార్లర్‌ను ఒక సమాచార కేంద్రంగా వాడుకుంటూ, పోలీసుల కళ్లు గప్పి గ్యాంగ్ సభ్యులకు నగదు , ఫోన్లను అందజేసేది.
3 Lady Dons : ఖుస్నుమా గుట్టు రట్టు ఇలా…
ఖుస్నుమా అన్సారీ అలియాస్ నేహా (మేడమ్ జెహర్) బాబీ కబూతర్ల గుట్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్ అత్యంత పకడ్బందీగా రట్టు చేసింది, బాబీ కబూతర్ గత ఏడేళ్లుగా పోలీసులకు దొరకకుండా నకిలీ గుర్తింపు కార్డులు (Fake Identities) వాడుతూ, తరచుగా తన నివాసాలను మార్చేవాడు. అయితే, అతని రహస్య కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌పై పోలీసులు సాంకేతిక నిఘా (Technical Surveillance) పెట్టారు. ఈ గ్యాంగ్ కదలికల గురించి పోలీసులకు ముందస్తుగా రహస్య సమాచారం (Secret Tip-off) అందింది. ముఖ్యంగా నేహా నడుపుతున్న బ్యూటీ పార్లర్ కేవలం ఒక ముసుగు మాత్రమేనని, అక్కడ నుండే డ్రగ్స్ నెట్వర్క్ నడుస్తోందని నిఘా వర్గాలు గుర్తించాయి.
3 Lady Dons : ఆపరేషన్ ట్రాప్..

నేహా సహా నిందితులు ఫిబ్రవరి 17, 2026 మంగళవారం అర్ధరాత్రి సమయంలో గురుగ్రామ్‌లోని ఒక మాల్లో షాపింగ్ ముగించుకుని ఒక SUV వాహనంలో ఢిల్లీకి వస్తున్నట్లు పోలీసులకు ఖచ్చితమైన సమాచారం అందింది. ఢిల్లీలోని మహిపాల్పూర్ ఫ్లైఓవర్ సమీపంలో పోలీసులు వ్యూహాత్మకంగా వల పన్నారు. నేహా ప్రయాణిస్తున్న కారును అడ్డుకుని, పారిపోయే ప్రయత్నం చేయకుండా చుట్టుముట్టి నేహా, బాబీ కబూతర్ , మరో ఇద్దరు సహచరులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో నేహా వద్ద పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు (Narcotics) దొరికాయి, ఇది ఆమె డ్రగ్ సిండికేట్‌ను నడుపుతున్నట్లు నిరూపించింది. వీరి వాహనంలో అత్యాధునిక తుపాకులు మరియు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
3 Lady Dons : నేహా రూటే .. డ్రగ్ టెర్రర్

నేహా నేరుగా సినీ నటి కాకపోయినప్పటికీ, ఆమె నేరాలకు సినిమా రంగానికి సంబంధం ఉంది. ఖుస్నుమా ఈశాన్య ఢిల్లీలో ఒక బ్యూటీ పార్లర్ నడిపేది. సమాజంలో ఒక సాధారణ మేకప్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొంది, ఎవరికీ అనుమానం రాకుండా తన నేర కార్యకలాపాలను ప్రారంభించింది. పార్లర్ ముసుగులో ఆమె ఒక పెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను నడిపినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలోని గ్యాంగ్స్టర్లకు సురక్షితమైన ఆశ్రయం కల్పించడానికి ఈ పార్లర్ ఆమె నివాసం వేదికలుగా మార్చింది. ఆమె ప్రియుడు మహఫూజ్ (అలియాస్ బాబీ కబూటర్) ద్వారా బిష్ణోయ్ గ్యాంగ్‌తో పరిచయం ఏర్పడింది.

లారెన్స్ బిష్ణోయ్ , హషీమ్ బాబా గ్యాంగ్‌లకు బాబీ కబూటర్ ప్రధాన ఆయుధ సరఫరాదారుడు. పాకిస్ఠాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలను దిగుమతి చేస్తున్నాడు. సింధు మూసేవాలా హత్యకు ఉపయోగించిన ఆయుధాల సరఫరాలో కూడా ఇతనికి సంబంధం ఉంది. దాదాపు ఏడేళ్లుగా పరారీలోని బాబీకి ఖుస్నుమా అన్ని విధాలా సహాయం చేస్తూ, గ్యాంగ్ కార్యకలాపాలను పర్యవేక్షించే స్థాయికి ఎదిగింది. దీనివల్ల ఆమెను “లేడీ డాన్” గా పిలవడం ప్రారంభించారు. ఆమెకు మేడమ్ జెహర్ అనే ముద్దు పేరు స్థిరపడింది.
3 Lady Dons : తూటాల రాణి అనురాధా చౌదరి

అనురాధా మింజ్.. రాజస్థానీ టెక్కీ. బిష్ణోయ్ గ్యాంగ్‌లో అత్యంత ప్రమాదకర డేడీ డాన్ గా గుర్తింపు పొందింది. తుపాకీ రాణి ఈమె ముద్దు పేరు. ఈమె కంప్యూటర్ అప్లికేషన్స్‌లో గ్రాడ్యుయేట్. ఒకప్పుడు షేర్ మార్కెట్లో పనిచేసింది. గ్యాంగ్‌స్టర్ ఆనందపాల్ సింగ్ మరణం తర్వాత ఈమె బిష్ణోయ్ గ్యాంగ్‌లో చేరింది. ఈమె ఏకే -47 అధునాతన ఆయుధాలను వాడటంలో శిక్షణ పొందింది,

బిష్ణోయ్ గ్యాంగ్‌కు వెన్నెముకగా నిలిచింది. పేర్కొన్నారు. గ్యాంగ్ ఆర్థిక వ్యవహారాలు (Extortion) వ్యూహరచనలో ఈమె సిద్ధహస్తురాలు. గ్యాంగ్ సభ్యులను ఎప్పుడు, ఎక్కడ దాచాలి అనే విషయాల్లో ఈమె మాస్టర్ ప్లానర్, ఇతర గ్యాంగ్‌లతో రాజీ చర్చల్లో ఈమె కీలక మధ్యవర్తి అని NIA స్పష్టం చేసింది.ఈమెను “లేడీ డాన్” మింజ్ అని పిలుస్తారు. ఇటీవలే గ్యాంగ్‌స్టర్ కాలా జతేడి (Kala Jathedi) ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నప్పటికీ పోలీసుల నిఘాలో ఉంది.
3 Lady Dons : కలెక్షన్ క్వీన్..
పూజా సైనీ.. టెర్రర్ -గ్యాంగ్‌స్టర్ నెట్వర్క్ లేడీ డాన్ బాధ్యతను దీప్తి బెహ్ల్ సహకారంతో పూజా సైనీ బాధ్యతలు నిర్వహిస్తోంది. లక్కీ పాటియాల్ , గోల్డీ బ్రార్‌లతో దీప్తి బెహ్ల్ జరిపిన లావాదేవీలను NIA గుర్తించింది. విదేశాల నుండి హవాలా మార్గంలో డబ్బును షూటర్లకు పంచడం ఈమె ప్రధాన పని. గ్యాంగ్ షూటర్లు దేశం విడిచి పారిపోవడానికి నకిలీ పాస్‌పోర్టులు , పత్రాలను పూజా సైనీ సిద్ధం చేస్తుంది.

ప్రధానంగా పంజాబ్ , హర్యానా షూటర్లు నేరం చేసిన తర్వాత రాజస్థాన్‌లోని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవడానికి ఈ మహిళ తమ ఇళ్లను లేదా కిరాయి ఇళ్లను ఉపయోగించారు. గ్యాంగ్ వసూలు చేసే కోట్లాది రూపాయల ‘ప్రొటెక్షన్ మనీ’ని సురక్షితంగా విదేశాలకు చేరవేసేందుకు పక్కా వ్యవస్థ ఉంది. థాయ్‌లాండ్, దుబాయ్ , కెనడాల్లోని హవాలా ఏజెంట్ల ద్వారా ఈ డబ్బును విదేశాలకు మళ్లిస్తారు. ఈ డబ్బును తిరిగి క్రిప్టోకరెన్సీ రూపంలో లేదా విదేశీ బ్యాంకు ఖాతాల ద్వారా ఆయుధాల కొనుగోలుకు ఉపయోగిస్తారు. విదేశాల్లో ఉన్న తమ అనుచరుల పేరుతో చిన్న చిన్న వ్యాపారాలు లేదా షెల్ కంపెనీలు సృష్టించి, నేరాల ద్వారా వచ్చిన సొమ్మును వైట్ మనీగా మారుస్తారు. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా యువతను ఆకర్షించి, విదేశీ వీసాలు లేదా డబ్బు ఆశ చూపి షూటర్లుగా మార్చుకుంటున్నారు. ఇక పూజా సైనీ లేడీ డాన్ గా అవతరించిన ఓ గృహిణి కావటం విశేషం.
ALSO READ : No Evidence : ఆధారాలు అదృశ్యం Andhra Prabha Insight Story
