సద్వినియోగం చేసుకోవాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; మహిళలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు సద్వినియోగంచేసుకొని ఉపాధిపొందుతూఆర్థికంగా ఆర్థిక అభివృద్ధి చెందాలని నారాయణపేట ఎస్ బి ఐ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో యాక్సెస్,లవ్లీహుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళలకు స్వయంఉపాధిపై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం మూడో రోజు కొనసాగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా అభివృద్ధి స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందన్నారు.
యాక్సెస్ లైవ్లీహుడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డి ఎఫ్ ఐ ప్రాజెక్ట్ కింద మహిళల కోసం ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీఎంఈజిపి, పీఎం ఎఫ్ఎంఈ, ఎమ్మెస్ ఎం ఈ రుణాలు వాటి అర్హతలుదరఖాస్తు విధానం సబ్సిడీ వివరాలు బ్యాంకుల పాత్రలపై వివరిస్తామని అన్నారు.మహిళలు చిన్న వ్యాపారాలను ప్రారంభించి అభివృద్ధి చేసుకునే అవకాశాలపై నైపుణ్యం పెరుగుతుందన్నారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ కేవైసీ అప్డేట్ వ్యాపార నిర్వహణలో నైపుణ్యాలను మహిళలకు వివరిస్తున్నట్లుపేర్కొన్నారు.
ఈ కార్యక్రమం డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ మంజునాథ్ పర్యవేక్షణలో క్లస్టర్ మేనేజర్ హరిలత సమన్వయంతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చిన్న తరహా వ్యాపారస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
