Municipal elections | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం..

Municipal elections | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం..
Municipal elections, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏడు నగర పాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో పొలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఓటు వినియోగించుకునేందుకు ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
