Train | విశాఖ మెట్రోకు..

Train | విశాఖ మెట్రోకు..

Train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ మెట్రోరైలు ప్రాజెక్ట్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఈ విషయం వెల్లడైంది. విశాఖపట్నం, విజయవాడలో మెట్రో ఏర్పాటు కోసం గతంలో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఈ ప్రాంతంలో అత్యాధునిక మెట్రో రవాణా వ్యవస్థ ఏర్పాటుకు దారితీసే ముఖ్యమైన అడుగు పడింది. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన, పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Leave a Reply