1.50 crore | టీవీకే అధినేత విజయ్ కు చుక్కెదురు

1.50 crore | టీవీకే అధినేత విజయ్ కు చుక్కెదురు
1.50 crore | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నటుడు, టీవీకే అధినేత విజయ్ ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వగా, దీనిపై 2022లో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. గత నెలలో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు, ఇప్పుడు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
