భీమ్‌గల్‌ టౌన్ 4 వార్డులో సమస్యలు పరిష్కరిస్తా – కోటగిరి విజయ బాల గంగాధర్..

భీమ్‌గల్‌ టౌన్ 4 వార్డులో సమస్యలు పరిష్కరిస్తా – కోటగిరి విజయ బాల గంగాధర్..

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించడం ద్వారా నాలుగో వార్డులో సమస్యలు పరిష్కారం చేస్తానని కోటగిరి విజయ బాల గంగాధర్ అన్నారు. శుక్రవారం నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్తించారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సహకార సంఘాల స్టేట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మినిరల్ డెవోలోప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ సహకారంతో వార్డు లో అభివృద్ధి పనులు చేస్తానని పేర్కొన్నారు.

నాలుగో వార్డు లో మురికి కాలువలు నిర్మాణం, సీసీ, రోడ్స్, డ్రైన్స్ నిర్మాణం చేయిస్తానని అన్నారు. ఇంటింటికి నల్లా ద్వారా నీరు, విద్యుత్ దీపాల ఏర్పాటు చేయిస్తానని, కాలనీల్లో పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం తన ధ్యేయం అన్నారు. వార్డు ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావిస్తూ పరిష్కారం చేస్తానని తెలిపారు. వార్డు ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికి రేషన్ కార్డ్స్, పింఛన్ లు ఇప్పిస్తానని అన్నారు. రాజకీయ అనుభవం ఉన్న తనకు అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపించేందుకు చేతి గుర్తుకు ఓటేయాలని కోరారు. వారి వెంట నాయకులు, మహిళలు, యువకులు ఉన్నారు.

Leave a Reply