Ghattuppal | బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా…

Ghattuppal | బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా…

Ghattuppal | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో తెలంగాణ సాధకుడు ఉద్యమనేత బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను విచారణ పేరుతో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మండల చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ధర్నాలు చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా రేవంత్ రెడ్డి సారాద్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కెసిఆర్ ను వేధిస్తుందని, వారిని అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కట్టుకథలు సృష్టించి ఇప్పుడు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన చర్య పాటుపడుతుందని అన్నారు.

రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడెం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోటకూరి శంకర్, గొరిగే సత్తయ్య బాలం నరసింహ,ఐతరాజు హనుమంతు, పున్న కిషోర్, చిలుకూరి అంజయ్య, తిరందాస్ ఆనంద్, దోర్నాల అమరేందర్,జూలూరు పురుషోత్తం, బావండ్ల శ్రీను, గంజి కృష్ణయ్య, పెదగాని శ్రీనివాస్, గజవెల్లి లక్ష్మయ్య, అందే రామచందర్, నేలంటి వెంకటేశం, బిపిఎల్ గౌడ్, వావిళ్ళ వెంకటేశం, జలాలుద్దీన్, పిషికే రాంబాబు, చిలువేరు అయోధ్య, చెరుపల్లి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply