Andhraprabha | వాస్తవ కథనాల వేదిక ఆంధ్రప్రభ దినపత్రిక

Andhraprabha | వాస్తవ కథనాల వేదిక ఆంధ్రప్రభ దినపత్రిక
- రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ శ్రీహరి
- ఆంధ్రప్రభ 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి
Andhraprabha | మక్తల్, ఆంధ్రప్రభ : వాస్తవ కథనాలకు చక్కటి వేదిక ఆంధ్రప్రభ(Andhraprabha) దినపత్రిక అని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వారికి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరి బికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, ఆంధ్రప్రభ నియోజకవర్గ ప్రతినిధి బి.శ్రీనివాసులతో కలిసి 2026 ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఇవాళ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… 1938లో స్థాపించిన ఆంధ్రప్రభ దినపత్రిక నాడు ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపించి నేటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతుండడం అభినందనీయమని అన్నారు. వాస్తవాలు తప్ప తప్పుడు వార్తలకు ఈ పత్రికల్లో స్థానం లేదన్నారు. వాస్తవాలను ప్రజలకు అందించడంలో ఆంధ్రప్రభ ముందు వరసలో ఉందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా ఉంటూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ వాటి పరిష్కారంలో ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.

ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి అనుకూలం కాకుండా వాస్తవాలను నిజాలను నిగ్గు తేల్చే విధానంతో ముందుకెళుతుందని అన్నారు. చాలా కాలంగా ఆంధ్రప్రభను గమనించిన వారికి ఈ విషయాలు అర్థమవుతాయని మంత్రి(Minister) పేర్కొన్నారు.
వాస్తవ కథనాల వేదిక ఆంధ్రప్రభ దినపత్రిక యాజమాన్యానికి పత్రికలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, కోళ్ళ వెంకటేష్, రాజేందర్ ,అశోక్ గౌడ్, వాకిటి హన్మంతు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
