Meets | మృదుల్ కుమార్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Meets | అంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు బృందం ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో స్విట్జర్లాండ్ కు తరలివెళ్లింది. ఈ క్రమంలో వారు స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో జ్యూరిచ్‌లో సమావేశమయ్యారు. దీనిపై లోకేశ్ ట్వీట్ చేశారు. ఏపీ-స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు స్విస్ కంపెనీలను ప్రోత్సహించడంపై ఈ భేటీలో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు లోకేశ్ తెలిపారు.

టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, రైల్వే, ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ వంటి కీలక రంగాల్లో స్విస్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను లోకేశ్ వివరించారు. పారిశ్రామిక రంగంతో పాటు విద్యా రంగంలోనూ సహకారంపై చర్చించారు.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఫార్మా, వైద్య పరికరాలు, స్టార్టప్‌ల రంగాల్లో స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఏపీలోని విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. దీని ద్వారా ఏపీకి చెందిన నిపుణులు, విద్యార్థులు, తెలుగు ప్రవాసులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply