Sankranthi Competition Muggulu | మహిళలకు బహుమతులు..

Sankranthi Competition Muggulu | మహిళలకు బహుమతులు..
Sankranthi Competition Muggulu, భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : భూపాలపల్లిలోని జంగేడు, సెగ్గంపల్లి గ్రామాలలో గురువారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తో కలిసి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకు బహుమతులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ.. గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతి కాపాడుకోవడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బుర్ర కొమురయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
