రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం

రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం
చల్లపల్లి – ఆంధ్రప్రభ : రంజాన్ సందర్భంగా దాతలు అరబ్బీ మదరసాకు సహాయం చేయటం ముదావహం అని టీడీపీ జిల్లా మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ హఫీజుర్ రెహమాన్ (ఏసీ బాబు) అన్నారు. మంగళవారం చల్లపల్లిలోని అరబ్బీ మదరసాకు మచిలీపట్టణంకు చెందిన స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ హసీంబేగ్ చొరవతో స్టార్ విద్యాసంస్థల విద్యార్థుల సహకారంతో రూ.15వేలు విలువైన 150కిలోలు బియ్యం, ఇరవై కిలోలు కందిపప్పు, 15 లీటర్లు ఆయిల్ అందచేశారు.
రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా మదరసా విద్యార్థులకు దాతలు సహాయం చేయటం అభినందనీయం అన్నారు. దాతల సహాయం పట్ల మదరసా నిర్వాహకులు, ఖురాన్ గురువులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ, మండల పరిషత్ కో- ఆప్షన్ సభ్యులు షేక్ నబీఘోరీ, ఏఎంసీ డైరెక్టర్ ఇబ్రహీం, మహమ్మద్ అమీర్ బేగ్ (అమీర్ జానీ) పాల్గొన్నారు.
