ఖానాపూర్ లో ఉట్నూర్ నాయకుల ప్రచారం

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఉట్నూర్ మండల మాజీ ఎంపీపీ జై వంతరావు, మాజీ వైస్ ఎంపీపీ సలీముద్దీన్, బి ఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ నాయకులు ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ముమ్మరంగా ప్రచారం చేసినట్లు వారు తెలిపారు. బి ఆర్ఎస్ నుండి నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ బలపరిచిన ఆదివాసీ మహిళా బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తొడసం ఇందిర ను 12 వ వార్డు కౌన్సిలర్ గా భారీ మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు అభ్యర్థి స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసినట్లు వారు తెలిపారు. ఈ ప్రచారంలో బి ఆర్ఎస్ పార్టీ ఉట్నూర్ మండల అధ్యక్షులు మాజీ ఎంపీపీ పంద్రా జైవంత్ రావు, మాజీ వైస్ఎంపీపీ సలీమోద్దీన్, బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, ఉట్నూర్ బి ఆర్ఎస్ ఉపాధ్యక్షులు దూట మహేందర్, కాటం రమేష్, పెందూర్ ప్రభాకర్, పూర్క బాపురావు,సోనేరావు, జై చంద్ర, సత్యన్నా, జాదవ్ రవి, శివ,గౌస్ సోహెల్, తదితరులు పాల్గొన్నారని మాజీ ఎంపీపీ జైవంతరావు తెలిపారు.

Leave a Reply