ఉయ్యూరులో దారుణం..

ఉయ్యూరు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణ ఘటన జరిగింది. పట్టణంలోని కాటూరు రోడ్డులో భార్యపై భర్త హత్యాయత్నం చేసాడు. నడి రోడ్డుపై భార్య తలపై రాయితో దాడి చేసాడు. భార్య పుష్పవతికి తీవ్రగాయాలు కాగా, భర్త సాంబయ్యని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనస్పర్థలతో వేరుగా ఉంటున్న భార్యాభర్తలు. సాంబయ్య భార్యపై హత్యాయత్నం చేయడంతో సరిగా ఉయ్యూరు పట్టణం ఉలికి పడింది. వివరాలు తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుని బాధితురాలని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave a Reply