woman | ఎస్‌యూవీలో వచ్చిన దుండగుల దౌర్జన్యం

woman | ఎస్‌యూవీలో వచ్చిన దుండగుల దౌర్జన్యం

woman | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. మంగళవారం రాత్రి ఎస్‌యూవీలో వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను అందరూ చూస్తుండగానే బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దుండగులు ఎస్‌యూవీలో వచ్చి మహిళను బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇది నిజంగా కిడ్నాప్ ఘటననా? లేక వ్యక్తిగత వివాదానికి సంబంధించినదా? అనే కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.

Leave a Reply