విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా..

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా..
కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : మార్చి 16వ తేదీ నుంచి ఏప్రియల్ 1వ తేదీ వరకు జరిగే పది పరీక్షలకు సోమవారం ఉదయం ప్రారంభమాయ్యాయి. పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగానే అన్ని సౌకర్యాలు కల్పించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 411 పాఠశాలలు పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. గుడివాడ డివిజన్ లో 118, మచిలీపట్నం డివిజన్లో 173, ఉయ్యూరు డివిజన్లో 120 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మార్చి 16న తెలుగు, 18న హిందీ, 21న ఇంగ్లీష్, 23న గణితం, 25న ఫిజికల్ సైన్స్, 28న బయాలజికల్ సైన్స్, 30న సోషల్ పరీక్షలు జరుగుతాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం 22,232 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
జిల్లాలో మొత్తం 29 స్టోరేజ్ పాయింట్ల నుండి ప్రశ్నాపత్రాలు, గోప్యమైన సామాగ్రి పంపిణీ కోసం 10 రూట్లు గుర్తించి 20 మంది రూట్ అధికారులను నియమించారు. 205 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 205 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. 1562 మంది ఇన్విజిలేటర్లు పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తారని, విద్యా శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో 5 ప్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, వెలుతురు, ఇతర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.

