Wall poster | మహా మేడారం జాతర వాల్‌పోస్టర్ ఆవిష్కరణ

Wall poster | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మహా మేడారం జాతర వాల్‌పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో సీఎం క్యాంప్ ఆఫీసులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ముఖ్యమంత్రి హోదాలో హాజరు కావాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అభివృద్ధి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. గద్దెల ప్రాంతంలో చేపట్టిన పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయని వివరించారు.
