మోడీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం

పోర్ట్‌ లూయిస్ : ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం మారిషస్‌ చేరుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆదేశ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం భారత ప్రధానికి మారిషస్‌ అత్యున్నత పురస్కారం ప్రకటించారు.

మోడీని గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ అండ్‌ కీ ఆఫ్‌ ది ఇండియన్‌ ఓషియన్‌తో సత్కరించారు. దీంతో మోడీ ఖాతాలో 21 అంతర్జాతీయ అవార్డు చేరినట్లయింది. మారిషస్‌ అత్యున్నత పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగానూ మోడీ రికార్డుకెక్కారు.

Leave a Reply