US Weapons Israel : గల్ఫ్ లో పేలుళ్లు Andhra Prabha Analysis

US Weapons Israel : గల్ఫ్ లో పేలుళ్లు Andhra Prabha Analysis

  • మధ్యప్రాచ్యంలో మంటలు
  • ప్రపంచంలో భీతావహం
  • టెహ్రాన్‌పై బాంబుల వర్షం
  • యుద్ధ జ్వాలల్లో మధ్యప్రాచ్యం..
  • తగ్గని ఇరాన్, ఇజ్రాయెల్
  • యుద్ధాన్ని ఆపండి..
  • చైనా హెచ్చరిక..
  • ఇజ్రాయెల్‌కు అమెరికా ఆయుధాలు
  • ఇరాన్ సుప్రీం లీడర్ వారసుడెవరు?..
  • యుద్ధంలో కీలక పరిణామం
  • ఇజ్రాయెల్‌కు 12 వేల బాంబులు
  • అమెరికా కీలక నిర్ణయం

( ఆంధ్రప్రభ, ఎనాలిసిస్) ​

చీకటి పడితే మరణం..తెల్లవారితే జననం.. ఇదీ పశ్చిమాసిలోపి ఇరాన్​, ఇజ్రాయెల్​గల్ఫ్​లోని అరబ్బు దేశాలు.. లెబనాన్​ లో స్థితి గతి. ఏ క్షణంలో అమెరికా ఇచ్చిన ఆయుధాలతో ఇజ్రాయెల్​ ఆకాశంలో విరుచుకు పడుతుందో.. మరు క్షణంలోనే ఇరాన్​ తన క్షిపణులను కుమ్మరిస్తుందో..

US Weapons Israel

ఊహించని పరిణామం. అప్పుడే ఓ వారం రోజులు గడిచిపోయాయి. రెండవ వారం ఆరంభం రోజు కూడా.. ఇటు ఇజ్రాయెల్​.. అటు ఇరాన్​ ఎక్కడ తగ్గటం లేదు. అసలు తగ్గేదే లేదంటూ చెలరేగిపోతుంటే.. సభ్య దేశాల్లోనూ ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి.

US Weapons Israel

ఎందుకీ మారణహోమం అని ప్రశ్నలు సంధిస్తున్నాయి. భేషరతుగా లొంగిపోవాలని ఇరాన్​ కు వార్నింగ్​ ఇచ్చిన అమెరికా.. తాజాగా ఈ చుద్ధం మరెన్నో రోజులు సాగదని స్వరం మార్చింది. చైనా కూడా తన గొంతు విప్పింది. ఈ జగడానికి స్వస్తి పలకాలి. లేదంటే ఈ యుద్ధ జ్వాలలు వ్యాపిస్తాయని హెచ్చరిక జారీ చేసింది. ఇక తమ దేశంలో భిన్న స్వరాలు వెలువడినా.. అమెరికా సంగతి తేలే వరకూ.. తాము తగ్గేది లేదని ఇరాన్​ గర్జించింది. ఇజ్రాయెల్​ కూడా ఇదే స్వరాన్ని వినిపిస్తోంది.

US Weapons Israel

ఔను శనివారం అర్థరాత్రి, ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్​ విమానాలు టెహ్రన్​ పై బాంబుల వర్షం కురిపించాయి. లెబనాన్​ పై విరుచుకుపడింది. ఇంతలోనే కువైట్​ సహా గల్ఫ్​ దేశాలకు ఇరాన్​ చుక్కలు చూపించింది. ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందోనని.. యావత్తు ప్రపంచం కలవర పడుతోంది.

US Weapons Israel : దాడులు యథాతథం

US Weapons Israel

సెంట్రల్ బీరుట్‌లో ఒక హోటల్ భవనంపై జరిగిన దాడిలో కనీసం నలుగురు మరణించారు. గల్ఫ్ లోని అన్ని దేశాల్లోనూ ఆదివారం తెల్లవారుజామున మరిన్ని వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడులను తిప్పి కొట్టినట్టు గల్ఫ్​ దేశాలు చెప్పుకున్నాయి. ఈ వారాంతంలో ఇరాన్‌పై మరిన్ని దాడులు తీవ్రతరం చేస్తామని, ఇక యుద్ధం ఎంతో కాలం సాగదని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇక ఇజ్రాయెల్ కొత్త దాడులు ప్రారంభించింది. శనివారం రాత్రి టెహ్రాన్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. టెహ్రాన్‌లో భారీ అగ్నిప్రమాదం కనిపించింది, రాత్రిపూట ఆకాశంలోకి పొగలు ఎగసిపడ్డాయి. శనివారం రాత్రి లభించిన ఫుటేజీ ఆధారంగా వాయువ్య టెహ్రాన్‌లోని షహ్రాన్ ఆయిల్ స్టోరేజీ భగ్గుమంది. దట్టమైన పొగ కమ్ముకుంది.

US Weapons Israel


తమ దేశాల్లో ఆదివారం తెల్లవారుజామున వైమానిక దాడులు జరిగాయని, వాటిని తిప్పి కొట్టామని పర్షియన్ గల్ఫ్ దేశాలు ప్రకటించాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంధన నిల్వను లక్ష్యంగా చేసుకుని శత్రు డ్రోన్‌లు విరుచుకుపడ్డాయని, కువైట్ సైన్యం తెలిపింది. ఈ ఉదయం జరిగిన దాడుల్లో కొన్ని పౌర మౌలిక సదుపాయాలను దెబ్బతిన్నాయి. ఒక నవీకరణలో, తమ గగనతలంపై మూడు బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించామని, ఆ ప్రాంతంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని కువైట్​ సైన్యం తెలిపింది. కువైట్ నగరంలోని డౌన్‌ టౌన్‌లోని దాదాపు 22 అంతస్తుల ప్రభుత్వ భవనం టార్గెట్​ గా ఈ దాడి జరిగినట్టు కువైట్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది.
తామూ డ్రోన్ దాడులను ఎదుర్కొన్నామని, ఆదివారం తెల్లవారుజామున కనీసం 21 డ్రోన్‌లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బహ్రెయిన్‌లోని కింగ్ ఫహద్ కాజ్‌వే మీదుగా, మినా సల్మాన్ ఓడరేవులోని ఒక కేంద్రంలో ఓ అగ్నిప్రమాదం జరిగింది. ఇరానియన్ దురాక్రమణే ఇందుకు కారణమని బహ్రెయిన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది, మంటలను అదుపులోకి తీసుకు వస్తున్నామని బహ్రెయిన్​ ప్రకటించింది.

US Weapons Israel : చాలు.. ,చర్చలకు రండి : చైనా

US Weapons Israel

ఈ వివాదానికి ముగింపు పలకాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పిలుపునిచ్చారు, “యుద్ధ జ్వాలలు” వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చైనా నాయకుడు జి జిన్‌పింగ్ బీజింగ్‌లో ట్రంప్‌నకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ యుద్ధం గురించి చైనా ఆందోళన పెరుగుతోంది. “ఇది ఎప్పటికీ జరగకూడని యుద్ధం, ఎవరికీ ప్రయోజనం చేకూర్చని యుద్ధం” అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి బీజింగ్‌లో విలేకరులతో అన్నారు. “చైనా ఎల్లప్పుడూ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని, దేశాలన్నీ వీలైనంత త్వరగా చర్చలకు రావాలని, పరస్సర చల్చలతో విభేదాలను పరిష్కరించుకోవాలని ఉమ్మడి భద్రతను సాధించడానికి ప్రయత్నాలు చేయాలని” ఆయన అన్నారు.

US Weapons Israel : నేడో రేపో.. సుప్రీం లీడర్​

US Weapons Israel

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం, ఆ దేశ నూతన సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం క్లిష్ట దశలో ఉంది. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ నేడో.. రేపో ఖమేనీ వారసుడ్ని ఎంపిక చేస్తారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వినిపిస్తున్నాయి. 88 మంది సభ్యులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ ఇప్పటికే ఆయనను ఎంపిక చేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కొత్త సుప్రీం లీడర్ ఎన్నికయ్యే వరకు దేశ బాధ్యతలను నిర్వహించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన తాత్కాలిక నాయకత్వ మండలి (Interim Leadership Council) ఏర్పడింది. ఇందులో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ప్రధాన న్యాయమూర్తి గులాం హొస్సేన్ మొహ్సేని-ఎజెయ్, అయతుల్లా అలీ రెజా అరాఫీ సభ్యులుగా ఉన్నారు. తండ్రి తర్వాత కొడుకు పదవిని చేపట్టడం (Hereditary Succession)పై ఇరాన్‌లోని కొన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. యుద్ధ వాతావరణం: అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. మోజ్తబాతో పాటు అలీరెజా అరాఫీ, అలీ అస్గర్ హెజాజీ తదితర సీనియర్ మత పెద్దల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

US Weapons Israel : అతడిని వదలం

US Weapons Israel

ఇరాన్ పై అమెరికా యుద్ధం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “అంతర్జాతీయ తప్పుడు లెక్కల ఫలితమని ఇరాన్ అత్యున్నత భద్రతా అధికారి అలీ లారిజాని అన్నారు, ఇరాన్ లో వెనిజులా నమూనాను పునరావృతం చేయగలనని ట్రంప్​ భావించారు, కానీ ఇప్పుడు వ్యూహాత్మక ప్రతిష్టంభనలో చిక్కుకున్నారు. శనివారం ఇరాన్ స్టేట్ టీవీలో ఒక ఇంటర్వ్యూలో , అలీ లారిజాని మాట్లాడుతూ, అమెరికా ఇప్పుడు “తన సొంత తప్పుడు లెక్కల ఊబిలో చిక్కుకుందని” ఇరాన్ పై దాడులతో ట్రంప్ తన లక్ష్యాలను సాధించడంలో విఫలమయ్యారని లారిజాని అన్నారు. ఇరాన్ నాయకత్వం సహా వెయ్యి మందికి పైగా ఇరానియన్ ప్రజలను చంపడం సమాధానం లేని నేరంగా మిగిలిపోదని, “ప్రతీకారం” సాధించే వరకు దురాక్రమణ దారుడిని శిక్షించే వరకు ఇరాన్ వెనక్కి తగ్గదని లారిజాని అన్నారు. “మేము ట్రంప్‌ను వదలం, అతను మూల్యం చెల్లించాలి” అని లారిజాని అన్నారు.

US Weapons Israel : ఇరాన్​ అధ్యక్షుడు ..సారీ.. తూచ్​

అంతకముందు, ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై గత వారంలో జరిగిన అనేక డ్రోన్ , క్షిపణి దాడులకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ శనివారం గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పారు. పొరుగు దేశాలపై దాడిని నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే డ్రోన్ లు, క్షిపణులు దూసుకు వచ్చాయి. ఇరానీ నాయకత్వంలో.. పొరపొచ్చాల కోసం ఎదురు చూస్తున్న అమెరికాకు ఓ గుడ్​ న్యూస్​ అందింది. ఇరాన్ ఉన్నతాధికారుల నుంచి విరుద్ధ ప్రకటనలు వెలువడ్డాయి. ఈ యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “మూల్యం చెల్లించాల్సిందే ” అని ఇరాన్ ఉన్నత భద్రతా అధికారి అన్నారు. ఇంతలో, గల్ఫ్ దేశాలపై దాడులకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పారు, కానీ ఇరాన్ నాయకుల మూకుమ్మడి దాడితో కొద్దిసేపటికే తూచ్​ అంటూ వెనక్కి తగ్గారు.

US Weapons Israel : ట్రంప్​ నివాళి

US Weapons Israel

ఈ వారం కువైట్‌లో మరణించిన ఆరుగురు ఆమెరికా ఆర్మీ రిజర్వ్ సైనికుల మృతదేహాలను శనివారం డెలావేర్‌లోని డోవర్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో తరలించి కుటుంబ సభ్యులకు అందజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ , ఉపాధ్యక్షుడు JD వాన్స్ మృత వీరులకు నివాళి అర్పించారు. డోవర్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద టార్మాక్ మీదుగా C-17 నుండి భౌతిక కాయాలను తరలస్తుంటే ట్రంప్ బంగారు “USA” అక్షరాలతో తెల్లటి బంతి టోపీని ధరించి సెల్యూట్ చేశారు.

US Weapons Israel : ₹ 1.42 లక్షల కోట్ల బాంబులు

US Weapons Israel

ఇరాన్‌పై సైనిక కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ పరిపాలన అత్యవసర పరిస్థితిని ప్రకటించి, కాంగ్రెస్‌ను దాటవేసి వెంటనే 12,000 బాంబులను ఇజ్రాయెల్‌కు విక్రయించింది. అమెరికా విదేశాంగ శాఖ నోటీసు ప్రకారం, ఇజ్రాయెల్ $151 మిలియన్ల డాలర్లె (₹ 1,42,599 కోట్లు) విలువ చేసే “పన్నెండు వేల (12,000) BLU-110A/B జనరల్ పర్పస్, 1,000-పౌండ్ల బాంబు బాడీలను కొనుగోలు చేయాలని అభ్యర్థించింది. ఈ రక్షణ వస్తువులు మరియు రక్షణ సేవలను ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వెంటనే విక్రయించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో “నిర్ణయించి వివరణాత్మక సమర్థనను అందించారు, తద్వారా కాంగ్రెస్ సమీక్ష అవసరాలను వదులుకున్నారు” అని నోటీసు పేర్కొంది. ఇరాన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న తరుణంలో అమెరికా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆయుధాల విక్రయాల వేగం పెంచింది. తన గిడ్డంగుల్లోని ఆయుధాల విక్రయాల కోసమే.. మధ్య ప్రాచ్చంలో కావాలనే అమెరికా యుద్ధం నిప్పు పెట్టిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

ALSO READ : india-russia-oil: ఇరాన్ స్ట్రాటజీ Andhra Prabha News

Leave a Reply