హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదు చేశారు. గతంలో తమ వద్ద సోషల్ మీడియా హ్యాండ్లర్ గా పనిచేసిన చంద్రకిరణ్ రెడ్డి ఈ నెల 6న బెదిరింపు సందేశం పంపాడని పేర్కొన్నారు. బకాయిలు తీర్చకుంటే మీరు శత్రువులు అవుతారని అందులో చెప్పారని వివరించారు. ఆమోదయోగ్యం కాని రీతిలో మెసేజ్లు ఉన్నాయన్నారు. చంద్రకిరణ్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని విజయశాంతి దంపతులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Threatening Calls ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు
