కమల్ దే హస్తముంటున్న రెండో వార్డ్ ప్రజలు

మంథని, ఆంధ్రప్రభ : పదవులు ఆశించి కాదు ప్రజా సేవకు మున్సిపల్ పోటీలో ఉన్నానని ఆశీర్వదించి, హస్తం గుర్తుకు ఓటెయ్యాలని రెండో వార్డ్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూకల కమల్ ఓటర్లను అభ్యర్థించారు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో కమల్ పై చేయి సాధించడం ఖాయమని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రచారంలో అడుగడుగున ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు సహకారంతో ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని ఆయన పేర్కొన్నారు. ఒకటో వార్డు ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, ఆశీర్వదించాలని ఆయన తెలిపారు.
హస్తం గుర్తుకు ఓటెయ్యండి, బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తానని ఆయన తెలిపారు. 6 గ్యారంటీల అమలతో పాటు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రత్యేక కార్యచరణ చేపడతానని ఆయన పేర్కొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఆయన తరుపున ప్రచారం చేయడం విశేషం. కౌన్సిలర్ గా గెలవడం ఖాయమని ఇప్పటికే జోరుగా చర్చ సాగుతుంది. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే కష్టం రాకుండా చూసుకుంటానని ఆయన తెలిపారు. వార్డు సందర్శన కార్యక్రమం నిరంతరం చేపట్టి వార్డులను ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు
