మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం తీసుకొచ్చిన ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించడం ఆనందంగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములకు పోడు పట్టాలు మంజూరైన నేపథ్యంలో బీడు వారుతున్న పోడు భూములకు జలకళను తెచ్చేందుకే సర్కార్ ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. ఆదివాసీలు ప్రత్యేక గిరిజన చట్టాలను వినియోగించుకోవాలని, త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో మాదిరిగానే గిరిజన ప్రాంతాల వారికి ప్రత్యేక ఉద్యోగాలు అందించే ప్రయత్నం చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు.
TG | పోడు భూములకు జలకళ : మంత్రి సీతక్క
