విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీవీఎఈ జేఏసీ తొర్రూరు కో చైర్మెన్ పండు నాగరాజు,కో కన్వీనర్ మంకాళి రమేష్ లు అన్నారు.విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీవీఈఏ జేఏసీ ఆధ్వర్యంలో తొర్రూరు డిఈ కార్యాలయం ముందు ఆర్టిజన్,అన్ మ్యాన్డ్, ఎస్ పీఎం, స్పాట్ బిల్లర్లు, పీస్ రేట్ వర్కర్లు 4వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టివిఏఈ జేఏసీ నాయకులను తక్షణమే పిలిచి కార్మికుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

విద్యార్హతల ఆధారంగా ఉద్యోగులు కన్వర్షన్ చేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్, టీజీ ఎన్పీడీసీఎల్ , మరియు టీజీఎస్పీడీసీఎల్ లలో అన్ మ్యాన్డ్ వర్కర్లకు ఆర్టిజన్ల గా విలీనం చేయాలని,విద్యుత్ సంస్థలు 4 డిసెంబర్ 2016 కంటే ముందు ఉన్న అర్హతను బట్టి పనిచేస్తు ఇప్పటికీ ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్గా గుర్తించాలని,విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పీసీ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనిస వేతనం చెల్లించాలని,2026 పి.ఆర్.సి వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని విద్యుత్ కార్మికులు తెలిపారు.ఈ కార్యక్రమంలో బంధారపు. శ్రీను,సునీల్,పుల్లయ్య, ఖాజాబీ,ఎర్రం కుమార్,వెంకన్న, జ్యోతి, సురేష్,శ్రీధర్ బాబు, రవీందర్, రాజు, రాఘవయ్య,యాకన్న, శుభాష్, వేణు, రామకృష్ణ, ఆర్టిజన్, అనుమ్యాన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply