పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహానాలు..

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహానాలు..

వాహనాల చోరీకి పాల్పడిన యువకుడు అరెస్ట్‌, రిమాండ్ ,

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ పరిధిలో వాహనాల చోరీకి పాల్పడిన ఓవ్యక్తిని భీమ్‌గల్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. స్థానిక ఎస్సై సిహెచ్.తిరుపతి శుక్రవారం సిబ్బందితో కలిసి భీమ్‌గల్‌ పట్టణంలో వాహానాలను తనిఖీ చేస్తుండగా, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన పాస్పుల నవీన్‌ అనే వ్యక్తిని తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న హీరో ఫ్యాషన్‌ బైక్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ కాగితాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. ఆర్మూర్‌ పరిధిలో హీరో ఫ్యాషన్‌ బైక్‌తో పాటు, బజాజ్‌ ప్యాసింజర్‌ ఆటోను దొంగిలించినట్లు విచారణలో తేలింది. నవీన్‌ గతంలో 14 వాహనాల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి వాహానాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్సై సిహెచ్.తిరుపతి తెలిపారు.

Leave a Reply