గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
టేకుమట్ల, ఆంధ్రప్రభ : పశు పోషకులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి సర్పంచ్ పెరుమండ్ల చంద్రకళ మొగిలి గౌడ్ అన్నారు. సోమవారం వెంకట్రావుపల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో 90 పశువులకు టీకాలు వేయడం జరిగిందని మండల పశువైద్యుడు వివేక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ చిమ్మనవేన శ్రీకాంత్, పశు సంపద సహాయకులు శంకర్, వార్డు సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
