TG | రక్తదానం ఎంతో గొప్పది..
TG | రక్తదానం ఎంతో గొప్పది..
- ఎంపీ గోడం నగేష్
TG | ఉట్నూర్, ఆంధ్రప్రభ : అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో గొప్పదని.. రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న రోగులకు ప్రాణదాతలుగా మిగులుతారని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. ఆయనతో పాటు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని హస్నాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి పురస్కరించుకొని ఆ గ్రామ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన వైద్య శిబిరం ఏర్పాటు చేయగా, ఆ శిబిరాన్ని ఎంపీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… స్వామి వివేకానంద చూపిన మార్గం యువతకు ఆదర్శనీయమని, యువత ఆయన మార్గంలో నడవాలని ఎంపీ కోరారు. మానవసేవయే మాధవసేవ భావనతో యువతకు స్వామి వివేకానంద బోధనలు ఆదర్శనీయమన్నారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో ఒక వంద మూడు యూనిట్ల రక్తదానం చేయడం ఆదర్శనీయమని, చరిత్రలో నిలబడుతుందని ఎంపీ అన్నారు. రక్తదానం చేసిన యువకులను ఎంపీ నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ అభినందించారు.
ఈ సందర్భంగా ఎంపీకి యూత్ నాయకులు, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హస్నాపూర్ ఉప సర్పంచ్ వాగ్మరే వర్షాతాయి, ఉట్నూర్ మాజీ జెడ్పిటిసి చారులత రాథోడ్, గ్రామ పెద్దలు శ్రీ స్వామి వివేకానంద యూత్ నాయకులు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
