Telangana | బీఏసీలో నిర్ణయం…

Telangana | బీఏసీలో నిర్ణయం…

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఈనెల 30వతేదీ వరకు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ సమావేశాలను మార్చి 16 నుండి మార్చి 30వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఈనెల 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ముఖ్యమంత్రి సమాధానం ఉంటుంది. ఈనెల 19న ఉగాది పండుగ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ఇస్తారు. ఈనెల 20వ తేదీన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈనెల 23నుండి వివిధ శాఖల పద్దులపై చర్చలు ప్రారంభమవుతాయి. ఈనెల 30వ తేదీన బడ్జెట్ ఆమోదం పొందనుంది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.

Leave a Reply