TDP | కొత్త కమిటీల ప్రకటన..

TDP | కొత్త కమిటీల ప్రకటన..

విస్తృత స్థాయిలో నియామకాలు

TDP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ను నియమిస్తూ, పలు కమిటీలను ప్రకటించింది.

తెలుగుదేశం పార్టీ (టిడిపి) సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ను నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా శ్రీనివాస్ కొనసాగనున్నట్లు తెలిపింది. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా పలు కమిటీలను కూడా ప్రకటించింది.

టిడిపి 29 మందితో పొలిట్‌బ్యూరో, 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసింది. అదనంగా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, ఉపాధ్యక్షులుగా 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించింది. ఈ నిర్ణయాలతో పార్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో టిడిపి ముందుకు సాగుతోంది.

Leave a Reply