ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో చింత.రాజ శ్రీనివాస్ సూచించారు.బుధవారం కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని పల్లె గుట్ట వద్ద జరుగుతున్న సిసిటీ పనులను ఎంపిడివో రాజ శ్రీనివాస్ క్షేత్ర స్థాయిలో సందర్శించి పరిశీలించి కూలీల హాజరు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని ప్రదేశంలో కల్పిస్తున్న మౌళిక వసతులపై ఫీల్డ్ అసిస్టెంట్ ను ఆరా తీసి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కొలతల ప్రకారం పనులు పూర్తిచేసి దినసరి కూలి పొందాలని సూచించారు.పనుల్లేని కూలీలకు ఉపాధి హామీ పనులు ఎంతగానో తోడ్పడుతాయన్నారు.ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో విద్యానంద్,ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ రమ తదితరులు పాల్గొన్నారు.
