Suicide Attempt | అన్న మద్దతు ఇవ్వలేదని…

Suicide Attempt | అన్న మద్దతు ఇవ్వలేదని…
- Suicide Attempt | సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
Suicide Attempt | నంగునూరు, ఆంధ్రప్రభ : సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం ఘనపూర్ గ్రామంలో ఎన్నికల్లో తన అన్న తనకు మద్దతు ఇవ్వడం లేదని ఆవేశంతో, కోపంతో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నాని(Suicide attempt)కి పాల్పడిన ఘటన ఈ రోజు చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.

Suicide Attempt | గతంలో సర్పంచిగా పనిచేసిన అన్న
నంగునూర్ మండల పరిధిలోని ఘనపూర్ గ్రామ సర్పంచ్ ఎస్సీ రిజర్వుడు కావడంతో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలు(nomination papers) దాఖలు చేశారు. ఇందులో ఇద్దరు అన్నదమ్ములైన బాల నరసయ్య, ఎల్లయ్య నామినేషన్ వేశారు. ఒకే ఇంట్లో ఇద్దరు పోటీ చేస్తే ఇబ్బందుల పాలవుతారని ఆలోచించి గతంలో సర్పంచిగా పనిచేసిన అన్న బాల్ నరసయ్యను బరిలో నుంచి కుటుంబీకులు తప్పించారు.
బరిలో నుండి పక్కకు జరిగిన బాల్ నర్సయ్య తమ్మునికి మద్దతు పలకకుండా ప్రత్యర్థిగా ఉన్న ఘనపురం సాయిలు(Ghanpuram Sailu)కు మద్దతుగా ప్రచారం చేయడంతో తమ్ముడు ఎల్లయ్య ఆవేదనకు గురయ్యాడు. ఈ రోజు బాల్ నరసయ్య ఇంటి ముందుకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి అతన్ని సిద్దిపేటకు హుటాహుటిన తరలించారు. కాగా ఎల్లయ్య దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.
Click Here To Read భార్యను చంపి తానూ..
