Steel Plant Fire Probe | నేడు ప్లాంట్‌కు విచారణ కమిటీ

Steel Plant Fire Probe | నేడు ప్లాంట్‌కు విచారణ కమిటీ

Steel Plant Fire Probe | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) 194 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ప్రమాణాల అమలు తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది.

Steel Plant Fire Probe

ప్రమాదంపై దర్యాప్తు నిర్వహించేందుకు నియమితమైన విచారణ కమిటీ నేడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించనుంది. ఘటనాస్థలిని పరిశీలించి, ప్లాంట్ అధికారులతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించనుంది. ఈ ఘటనతో స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.