GOD|భగవంతునికి సేవ చేయడమంటే అదృష్టమే
- భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు
GOD| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: భగవంతుని సన్నిధిలో సేవా చేయడమంటే ఎంతో అదృష్టమని, పాలకవర్గ సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం శ్రీరాంపురంలోని శ్రీరామలింగేశ్వర స్వామి (సుబ్బారాయుడు గుడి) దేవస్థాన పాలకవర్గం సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ ఛైర్మన్ గా గుండు త్రివిక్రమ మూర్తి, సభ్యులుగా గురుమూర్తి, వెంకట సత్యవతి, వెంకట కృష్ణగుప్తా, కుమారి, కోడూరి రామకృష్ణ, ఎం మహాలక్ష్మి, రవితేజలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఆలయ అభివృధ్దికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని, ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో సక్రమంగా నిర్వర్తించాలన్నారు. షష్టి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దండు కృష్ణంరాజు, ముదునూరి సత్యనారాయణ రాజు, తోట శ్రీనివాస్, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

