సీపీఐ సీనియర్ నాయకుడు గొర్రెజోసఫ్ రాజు మృతి

బెల్లంపల్లిరూరల్, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండల సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి,సీనియర్ ఆర్ఎంపీ వైద్యుడు గొర్రె జోసఫ్ రాజు(64) శుక్రవారం తెల్లవారుజామునగుండెపోటుతో మృతి చెందారు. మండలం లోని తాళ్లగురిజాల గ్రామానికి చెందిన జోసఫ్ రాజు సీపీఐ పార్టీ లో క్రియాశీలకకార్యకర్త గా పనిచేశారు.

అంతే కాకుండా పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తూ మూడు సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందారు. ఆర్ఎంపీ వైద్యునిగా గత నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందారు. మండలంలోని తాళ్ల గురిజాల, రంగపేట, మాల గురిజాల బట్వాన్ పల్లి, లంబడి తండా, తదితర గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

పదవి విరమణ పొందిన తర్వాత ఆర్ఎంపీ వైద్య వృత్తిని కొనసాగిస్తు,పాస్టర్ గా కూడా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆయన మరణ వార్త తెలియగానే వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తల్లి వచ్చి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

జోసఫ్ రాజు మృతి సీపీఐ పార్టీకి తీరని లోటు

సీపీఐ పార్టీసీనియర్ మండల నాయకుని గా పనిచేసిన జోసఫ్ రాజు అకాల మరణం సీపీఐ పార్టీకి తీరనిలోటని మండల సీపీఐ సెక్రటరీ బొంతల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్బంగా జోసఫ్ రాజు భౌతిక కాయంపై ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు.

రాజు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి వరకు పనిచేసినగొప్ప నాయకుడని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో మాలగురిజాలసీపీఐశాఖకార్యదర్శి గోమాస గంగారాం, నాయకులుమేరుగు పోశం, జూపాక సురేందర్, మాజీ సర్పంచ్ దూగుట తిరుపతి, కలాలి భూమేశ్వర్, అనుదీప్ భోగెకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply