మహిళలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన మహానీయుడు…

మహిళలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన మహానీయుడు…

చిట్యాల, ఆంధ్రప్రభ : అణగారిన వర్గాల అభ్యున్నతికి,కుల వ్యవస్థ నిర్మూలనకు సత్యశోధక్ సమాజ్ ని మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించారని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు.చిట్యాల మండల కేంద్రంలో శనివారం నాడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ మహిళలకు చదువు అవసరం అని,తన బార్య సావిత్రి బాయ్ పూలే కి అక్షరాలు నేర్పి, ఆమెను ఉపాద్యాయులు గా తయారు చేసి, మహిళలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన మహానుభావుడు పూలే అని కొనియాడారు.

పూలే జీవితాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, కేవిపియస్ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డు బాబురావు, గాదె ఎల్లేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు నోముల పురుషోత్తం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు పాల లక్ష్మయ్య, జిట్ట నరేష్, బాకీ అండాలు, మేడి శోభ, జనపాల జ్యోతి, యమున, ముత్తయ్య, శేఖర్, రమణ, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply