Saralamma | డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య జాతర వైభవం

Saralamma | డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య జాతర వైభవం

  • సాలమ్మ రాకకు పోటెత్తిన భక్తజనం
  • భారీ బందోబస్తు మధ్య గద్దె పైకి చేరుకున్న సారలమ్మ
  • డప్పులు, కోళ్ల బలి, శివశక్తులతో ఊగిన భక్తులు
  • నేడు గద్దె పైకి చేరుకొనున్న సమ్మక్క

Saralamma | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడెం, కోమటిగూడెం, రంగా రాయి గూడెం, అక్కపల్లి గూడెం గ్రామాల పరిధిలో ఉన్న చింతగట్టు సమ్మక్కసారలమ్మ జాతర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. జాతరలో భాగంగా బుధవారం సాయంత్రం వనం నుంచి డప్పు చప్పు ళ్లు, శివసత్తుల పూనకాల మధ్య దక్షిణ దిశలోని చింతగట్టు వద్ద సార లమ్మను గద్దెకు చేర్చారు. స్టేషన్ ఘన్‌పూర్ సీఐ జి.వేణు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ, జాతర చైర్మన్ తోట వెంకన్న, వైస్ చైర్మన్ మ్యాదారవేన కర్ణాకర్, కమిటీ సభ్యుల సమక్షంలో పూజారులు మందపురం భాషా, కుంట మల్లేష్ అమ్మవారిని గద్దెకు చేర్చారు.

ఆది వాసీ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా భక్తులు మార్గమధ్య లో కోళ్లు బలి ఇచ్చి, డప్పు వాయిద్యాలు మోగిస్తూ, శివశక్తులతో ఊగుతూ అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నేడు ఉత్తర దిశలోని చింతగట్టు వద్ద ఉన్న సమ్మక్క గద్దెకు అమ్మవారు చేరుకోనున్నారు.

Saralamma |

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మందపురం రాణి అనిల్, జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, పనికర సోమయ్య, మాజీ జాతర చైర్మన్ మందపురం ఎల్లగౌడ్, ఉప సర్పంచ్ లింగనబోయి న రాజు, నాయకులు మునిగేల రమేష్, లింగనబోయిన శ్రీకాంత్,

Saralamma |

భారీ పోలీస్ బందోబస్తు :

Saralamma |

జాతర సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా స్టేషన్ ఘన్‌పూర్ సీఐ జి.వేణు ఆధ్వర్యంలో ఎస్ఐ లు వినయ్, రాజేష్ సుమారు 60 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమ త్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

భక్తులకు మెడికల్ క్యాంపు ఏర్పాటు :

Saralamma |

జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది భక్తులకు అవస రమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్యాంపులో మెడికల్ ఆఫీసర్ ప్రణీత, డాక్టర్ రమ్య, సిహేచ్ ఎన్ రమణ, హెచ్ ఈ ఓ భగవాన్ రెడ్డి, ఏం ఎల్ హెచ్ పి రాజేశ్వరి, ఎఎన్ ఏం రాజ్యలక్ష్మి, ఆశ వర్కర్ లు జి. భాగ్య లక్ష్మి, సిహెచ్ నిర్మల, పి. అరుణ, రవి తదితరులు ఉన్నారు.

Leave a Reply