Revanth Reddy | సమాన అవకాశాలే అభివృద్ధి బాట..

Revanth Reddy | సమాన అవకాశాలే అభివృద్ధి బాట..
Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గాంధీ, అంబేడ్కర్ దేశానికి రెండు కళ్లలాంటివారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంబేడ్కర్ జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ నిర్మాణంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర అమూల్యమని, వారు దేశానికి రెండు కళ్లలాంటివారన్నారు.
బలమైన దేశంగా భారత్ ఎదగడానికి అంబేడ్కర్ చేసిన కృషి అపారమని ఆయన పేర్కొన్నారు. సమాన అవకాశాలు కల్పిస్తేనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అంబేడ్కర్ చూపిన మార్గాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని తెలిపారు.
ప్రజల కలలను సాకారం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వెల్లడించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన పబ్లిక్ స్కూల్ విధానం ద్వారా పిల్లల భవిష్యత్తు మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేం నిరంతరం పనిచేస్తుంటే కొందరు గోతులు తవ్వుతున్నారన్నారు. గోతులు తవ్వుతున్న వారిని మీరే అదే గోతిలో పాతిపెట్టాలన్నారు. పదేళ్ల విధ్వంసం వందేళ్ల నష్టానికి దారితీసిందన్నారు.
ఆనాడు చేసిన అప్పులు చెల్లిస్తూ… తప్పులు సవరిస్తున్నామన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సోనియా గాంధీ చెబుతున్నారన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారన్నారు.
