ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ శర్మ వన్డేల్లో వరుసగా 12వ సారి టాస్ ఓడిపోయాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కసారి కూడా టాస్ గెలవలేకపోయాడు.
దీంతో వన్డేల్లో వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిన కెప్టెన్ గా అన్ వాంటెడ్ రికార్డ్ క్రియేట్ చేశాడు రోహిత్. ఈ జాబితాలో బ్రియాన్ లారా అగ్రస్థానంలో ఉంన్నాడు. కెప్టెన్గా వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన రికార్డ్ వెస్టిండీస్ మాజీ సారథి బ్రియాన్ లారా పేరు మీద ఉంది. బ్రియాన్ లారా 1998 అక్టోబర్ నుంచి 1999 మే మధ్య 12 సార్లు టాస్ ఓడిపోయాడు.
ఇప్పుడు రోహిత్ శర్మ కూడా 12 సార్లు టాస్ ఓడి.. బ్రియాన్ లారా సరసన నిలిచాడు. ఇక 11 సార్లు టాస్ ఓడి ఆ తర్వాత స్థానంలో నెదర్లాండ్ మాజీ కెప్టెన్ పీటర్ బోరెన్ (2011 మార్చి నుంచి 2013 ఆగస్టు మధ్య) ఉన్నాడు