
Rachur | ఆర్థిక సహాయం అందజేత
Rachur | ఆర్థిక సహాయం అందజేత
- సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాసులు
Rachur | వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల పరిధిలోని రాచూర్ గ్రామానికి చెందిన మల్లోజ్ అనిల్ కుమార్ నిరుపేద కుటుంబంలో జన్మించి వృత్తిరీత్యా వడ్రంగి పనితో పాటుగా పంచర్ దుకాణాన్ని నడుపుతూ జీవనం గడుపుతుండేవారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు.
విషయం తెలుసుకున్న రాచూర్ సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాసులు అనిల్ కుమార్ ఆకస్మికంగా మృతిచెందడం ఎంతో బాధాకరమని చింతించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అన్నివేళల్లో అండగా ఉంటామన్నారు. అనంతరం మృతుని భార్య సరితకి రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
