ప్రైవే పబ్లిసిటీ ఏజెన్సి చేతుల్లో బీఆర్ అంబేద్కర్ పార్కు ….

ప్రైవే పబ్లిసిటీ ఏజెన్సి చేతుల్లో బీఆర్ అంబేద్కర్ పార్కు ….

రూ.3 కోట్ల తో అభివృద్ధి చేసిన అంబేద్కర్ పార్కు…
పార్కు కన్పించకుండా మింగేసిన కమర్షయల్ పబ్లిసిటీ ఏజెన్సి బోర్డులు….
పబ్లిసిటీ ఏజెన్సినిర్వాకం తో రూ.3 కోట్లు వృధా…
స్థానిక ప్రజలకు అక్కరకు రాకుండా అంబేద్కర్ పార్కు…
అనుమతి తక్కువ …. పబ్లిసిటీ ఏజెన్సి బోర్డులు ఎక్కువ…
వేళల్లో కార్పోరేషన్ కి.. లక్షల్లో ప్రవేటు పబ్లిసిటీ ఏజెన్సిసి జేబులోకి…
చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ … పార్కు సెక్షన్ విభాగం అధికారులు…

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్ పరిధి లోని కృష్ణలంక జాతీయ రహదారి పక్కన స్థానిక ప్రజల కు అందు బాటులో ఉండే విధంగా, వేసవి సెలవుల లో స్కూల్,కాలేజీ విద్యార్థుల కు ఉపయోగపడే విధంగా కృష్ణ లంక కాలువ వడ్డున 14 వ ఆర్ధిక సంఘం రూ. 3 కోట్ల నిధుల తో కార్పోరేషన్ పార్కును ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పార్కు ను అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపూ సురేష్ చేతుల మీదుగా మార్చి 27 వ తేదీ 2023 లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి కృష్ణ లంక స్థానిక ప్రజల కు అందుబాటులోకి తెచ్చారు.

ఈ పార్కు లో కుటుంబాలు ఎంజాయ్ చేసేందుకు, పిల్లులకు పెద్దలకు ఉపయోగపడేవిధంగా పార్కు ను అన్ని హంగుల తో సుందరీ కరణంగా తయారు చేశారు. అడుగు అడుగున కళ్లు మిరిమేట్లు విద్యుత్ కాంతులతో పార్కు ను ప్రజల అవసరాల కోసం కోట్ల రూపాయలతో అభివృధి చేసి అంబేద్కర్ పార్కు ను ప్రజల కోసం అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పించి అందు బాటు లోకి రావడం జరిగింది. కృష్ణ లంక జాతీయ రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ పార్కు లో ఒక పబ్లిసిటీ ప్రైవేటు ఏజెన్సీ కి కొన్ని బోర్డు లు పెట్టుటకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.

అయితే ప్రవేట్ పబ్లిసిటీ ఏజెన్సి అనుమతి ఇచ్చింది కొన్ని బోర్డుల కు అయితే,పార్కు చుట్టు ప్రవేటు కమర్షియల్ పబ్లిసిటీ బోర్డులు పెట్టడం వలన డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ పార్కు పూర్తి గా కన్పించకుండా పోయిందని స్థానిక ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి వెంట వచ్చే పోయి వారికి అంబేద్కర్ పార్కు కనిపించేది ఇప్పుడు ఆది పూర్తి ఏజెన్సీ బోర్డు లు పెట్టుట వలన పార్కు లోకి వచ్చే ప్రజలకు ఏమీ వస్తువులు ఉన్నాయి అనేది తెలియకుండా పోతుందని పబ్లిసిటీ బోర్డులు ఏర్పాటు పై స్థానిక ప్రజలు మండి పడుతున్నారు.

కృష్ణ లంక డాక్టర్ బి.ఆర్ ఆర్ అంబేద్కర్ పార్కులో పబ్లిసిటీ ప్రైవేటు ఏజెన్సీ ఎన్నీ బోర్డు లు పెట్టుటకు అనుమతి ఉంది. ఏజెన్సీ ఎన్నీ బోర్డు లు పెట్టింది … ఒక సారి కార్పోరేషన్ అధికారులు… పరిశీలన చేసి.. అనుమతి లేని హోర్డింగుల ను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply