అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
- రెండు అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
- నిందితులపై కేసు నమోదు
- చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ వెల్లడి
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని ,కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ సోమవారం తెలిపారు. మండలంలోని కాల్వపల్లి మానేరు వాగు నుండి వస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను తమ సిబ్బంది ఆపి పరిశీలించగా, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా మానేరు వాగు నుండి దొంగతనంగా ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు.
దాసరపు సమ్మయ్య డ్రైవర్ వేషాలపల్లి,ట్రాక్టర్యజమాని,గుడేపు రాయమల్లు, జంగేడు. నాయడి రాజేష్ డ్రైవర్ వేశాలపల్లి, ట్రాక్టర్ యజమాని,దుర్గం రాజకుమార్, కాసింపల్లి, నలుగురిపై కేసు నమోదు చేసినట్లయితే తెలిపారు,స్వాధీనం చేసుకున్న రెండు ట్రాక్టర్లను చిట్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు, ఎస్సై సతీష్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పన్నారు .
