చిట్యాల ఎస్ఐగా పోచంపల్లి సతీష్ బాధ్యతల స్వీకరణ..

చిట్యాల ఎస్ఐగా పోచంపల్లి సతీష్ బాధ్యతల స్వీకరణ..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా పోచంపల్లి సతీష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పని చేసిన ఎస్ఐ జి శ్రావణ్ కుమార్, భూపాలపల్లి సెకండ్ ఎస్సై గా బదిలీ అయ్యారు. భూపాలపల్లిలో పని చేసిన ఎస్సై సతీష్‌ను చిట్యాల ఎస్సైగా బదిలీ చేశారు. దీంతో పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

Leave a Reply