నా బిల్లులు చెల్లించండి మహాప్రభో..

నా బిల్లులు చెల్లించండి మహాప్రభో..

శావల్యాపురం, ఆంధ్రప్రభ : మండలంలోని పొట్లూరు గ్రామపంచాయతీ పరిధిలో 2024వ సంవత్సరంలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామని, ఇన్ని రోజులు గడుస్తున్నా బిల్లులు చెల్లించకుండా విచారణ పేరుతో అధికారులు పబ్బం గడుపుతున్నారని సర్పంచ్ పోపూరి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పొట్లూరు గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. గ్రామాభివృద్ధి కొరకు పనులు చేపడితే వాటి బిల్లులు చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్లో ఉంచడం ఎంత వరకు సమంజసం అన్నారు.

నాకు రావాల్సిన బిల్లులు సుమారు 10 లక్షల పైగా ఉన్నాయని ఈ విషయం పై జిల్లా కలెక్టర్కు, జిల్లా పంచాయతీ అధికారి, మండల అభివృద్ధి అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధిననే నా పై అధికారులు చిన్నచూపు చూస్తున్నారని, నెలల తరబడి బిల్లులు నిలిపివేయడం వల్ల నా ఆర్థిక పరిస్థితి కొట్టుమిట్టాడుతుందని, దాని వల్ల నేను తీవ్రమైన మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నానని అన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణమే చెల్లించని ఎడల ప్రజాస్వామ్య పద్ధతిలో గ్రామ ప్రజలతో కలసి నా హక్కుల కోసం పోరాడవలసి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Leave a Reply