పంచాయితీ సిబ్బంది సేవలు ఆదర్శం..

కడెం, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో ఆదర్శనీయమని అల్లంపల్లి గ్రామ సర్పంచ్ తొడసం కాంత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మండలంలోని అల్లంపల్లి గ్రామ సర్పంచ్ తోడసం కాంత నరేష్ ఆధ్వర్యంలో సోమవారం పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ, ప్రాంతాల్లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల మెరుగుదల లక్ష్యంగా ఈ కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు.
గ్రామపంచాయతీ కార్మికుల భద్రత దృష్ట్యా వారికి గ్లౌజులు సబ్బులు శానిటేషన్ వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం ఆయనను జి పి కారోబార్ దేవయ్య కార్మికులు గుణవంతురావ్ రాజవ్వ సరోజలను శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి బేర మనోజ్ ఫీల్డ్ అసిస్టెంట్ రాయి కాంత్ జిపి వార్డు సభ్యులు గ్రామస్తులు జి పి కార్మికులు పాల్గొన్నారు.
