Ootkur | పీఎం, సీఎం ఫోటోలతో ఊట్కూర్ జీపీ కార్యాలయం

Ootkur | పీఎం, సీఎం ఫోటోలతో ఊట్కూర్ జీపీ కార్యాలయం

Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా గెలుపొందిన సర్పంచుల ప్రమాణస్వీకారం ఏర్పాట్లలో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ గ్రామపంచాయతీ భవనానికి నూతన సర్పంచ్ ఎం. రేణుక భరత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు వినూత్న ఆలోచనతో గ్రామపంచాయతీ భవనం ముందు భాగం బోర్డులో పీఎం, సీఎం ఫోటోలు(PM and CM photos) ఏర్పాటు చేయడంతో ప్రమాణస్వీకారంలో విశేషంగా ఆకట్టుకుంది.

ఈ రోజు ఊట్కూర్ గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి గ్రామపంచాయతీ కార్యాలయం రంగులు వేసి ముస్తాబు చేయగా పంచాయతీ భవనం బోర్డుకు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో,,, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫోటో వేయించడంతో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply