77 DLDO | గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు

77 DLDO | గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు

  • ప్రభుత్వ పథకాలు పారదర్శకతతో అమలు చేయాలి
  • డీడీఓ కార్యాలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

77 DLDO | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : డివిజన్ స్థాయిలో ప్రభుత్వ పథకాలు పారదర్శకతతో అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలోని డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ఆయన వర్చువల్‌గా చిత్తూరు జిల్లా నుంచి గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు సమీకృతం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యాలయాలు ఉండటం వలన మరింత ఫలితాలు సాధించాలన్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలు(welfare schemes) అమలు చేసే విధంగా అధికారులు ఉండాలని ఆదేశించారు. ఎలాంటి సిఫార్సు లు లేకుండా అధికారులు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.

సామర్థ్యం పెంచేందుకు శిక్షణా సంస్థలను బలోపేతం చేస్తామన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఐటీ విభాగం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు ఉపయోగపడతాయన్నారు.

రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్న(Chintakayala Ayyanna)పాత్రుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, డివిజన్ స్థాయిలో పర్యవేక్షణకు ఈ కార్యాలయం కీలకంగా మారుతుందన్నారు. ఈ శాఖలో ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు లేక ఎక్కడ పోస్టింగ్(Posting) పొందితే అక్కడే పదవీ విరమణ చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఈ రోజు వారికి పదోన్నతులుతో పాటు బాధ్యతలు ఇచ్చారన్నారు.

ప్రతీ డిపార్ట్మెంట్‌కు డివిజన్ స్థాయిలో కార్యాలయాలు ఉన్నాయని, డివిజనల్ స్థాయిలో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించడం ఒక గొప్ప శుభ పరిణామమన్నారు. టెక్కలి డివిజన్‌లో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. మరింత దగ్గరగా ప్రజలకు సేవలందించేందుకు ఈ కార్యాలయం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. డివిజనల్ స్థాయిలో డీడీఓ కార్యాలయాలను మినీ కలెక్టరేట్‌(Mini Collectorate)గా ఉంటుందన్నారు. డివిజన్ స్థాయిలో డీడీఓ కార్యాలయాలను శాశ్వత భవనాలు నిర్మాణాలు చేపట్టాలన్నారు.

శ్రీకాకుళం డివిజనల్ అభివృద్ధి అధికారి అరుంధ‌తి దేవి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డీఎల్డీఓగా పదోన్నతి కల్పించినందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో డివిజనల్ అభివృద్ధి(Divisional Development) అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రారంభించారు.

డీఎల్డీఓ సిబ్బంది కార్యాలయ రూంలను స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఇన్‌చార్జ్ సీఈఓ కిరణ్ కుమార్, డీపీఓ కె.భారతి సౌజన్య, శ్రీకాకుళం డివిజనల్ అభివృద్ధి అధికారి అరుంధ‌తి దేవి, డివిజన్‌లోని మండలాల ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ రోజు మూడు డివిజన్ల‌లో మూడు డీఎల్డీఓ కార్యాలయాలను ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా నుంచి వర్చువల్‌గా ప్రారంభించినట్లు తెలిపారు.

అభివృద్ధికి సంబంధించిన అధికారులను డీఎల్డీఓ కార్యాలయంలో ఉంటారన్నారు. ఇప్పటికే డీపీఓ కార్యాలయం నుంచి డివిజనల్ పంచాయతీ(Divisional Panchayat) అధికారిని డీఎల్డీఓ కార్యాలయానికి తీసుకువచ్చినట్లు చెప్పారు. డ్వామా కార్యాలయం నుంచి ఏపీడీ ఉంటారన్నారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 77 డీఎల్డీఓ(77 DLDO) కార్యాలయాలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు చెప్పారు. దీనివ‌ల్ల గ్రామాల్లో పరిపాలన, అభివృద్ధి ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో మూడు డీడీఓ వచ్చినందు వలన పరిపాలన, అభివృద్ధి రెండింటి వలన అధికారులకు పర్యవేక్షణ సులభతరం అవుతుందన్నారు.

Leave a Reply