గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట…

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట…

గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి…

బిక్కనూర్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గుర్జకుంట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను మంజూరు చేస్తుందని గుర్తు చేశారు.

అట్టి పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో మురికి కాలువలు, సిమెంట్ రోడ్లు, మంచినీటి వసతి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. గ్రామాలలో ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సామ సంతోష రెడ్డి, ఉప సర్పంచ్ గొల్ల సంతోష్, నాయకులు జైపాల్ రెడ్డి, భరత్ రెడ్డి, రాఘవరెడ్డి, భూపతిరెడ్డి పలువురు కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply