MP | జగన్‌ నాపై అనవసరంగా కామెంట్స్ చేశారు

MP | జగన్‌ నాపై అనవసరంగా కామెంట్స్ చేశారు

  • నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

MP | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : అప్పన్న అనే వ్యక్తి కుటుంబానికి జరుగుబాటు లేకపోవడంతోనే తాను సేవా భావంతో రూ.50 వేలు చెక్కు ఇచ్చానని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(Vemireddy Prabhakar Reddy) స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జీ సీఎం వైసీపీ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆయనపై చేసిన అనవసర ఆరోపణలకు స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా కనుపర్తిపాడులోని వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఆత్మీయ సమావేశం( intimate meeting)లో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ జగన్‌ తనపై అనవసరంగా కామెంట్స్ చేశారని.. తాను ఏంటో ఆయన ఆత్మకే వదిలేస్తున్నానన్నారు. ఎవరు చెబితే తాను ఇచ్చానో తెలియదా అని ప్రశ్నించారు.

శ్రీకాకుళంకు చెందిన అప్పన్న అనే వ్యక్తి పేదవాడు, జరుగుబాటు లేదు అని నాడు వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) దగ్గర చేరితే, సుబ్బారెడ్డి తాను సహాయం చేయలేనని నన్ను అడిగితే… ఈ రోజు ఏ విధంగా అయితే సహాయం చేశానో.. ఆ రోజు కూడా అలాగే చేశానని కుండబద్దలు కొట్టారు. తాను మాట్లాడే విషయాలు సత్యమా, కాదా అనేది దేవుడి ముందుకు వచ్చి ప్రమాణం(standard) చేయాలన్నారు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి జరుగుబాటు లేదని అంటే.. ఇప్పటికీ కూడా చాలామందికి సహాయం చేస్తున్నానని, తాను నెలలో సహాయం చేసేవాళ్ల లిస్ట్‌ తీస్తే చాలామంది ఉంటారన్నారు.

ఈ విషయాలు వారికి కూడా తెలుసని, ఎవరు చెబితే ఇచ్చానో వారి దృష్టిలో ఉందన్నారు. అసలు తనపై అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదని ఖండించారు. సేవాభావంతోనే(With a sense of service) తాను సహాయం చేస్తుంటానని, సేవ చేయడం కూడా తప్పవుతోందని అన్నారు. బండలు మోయాల్సి వస్తోందని ఆవేదన చెందారు. ఎంత చేశామో, ఎవరికి చేశామో, మనం చేసే మంచేంటో దేవుడికే తెలుసని, జగన్‌ మోహన్‌రెడ్డి మాటలు బాధేశాయి కాబట్టే ఇప్పుడు చెబుతున్నానన్నారు.

Leave a Reply