ఎంపీ చామలకు కృతజ్ఞతలు..

ఎంపీ చామలకు కృతజ్ఞతలు..

  • మోత్కూర్ మున్సిపల్ నూతన పాలకవర్గం..

మోత్కూర్, ఆంధ్రప్రభ ; ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మోత్కూర్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం తో పాటు చైర్మన్ ,వైస్ చైర్మన్ లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం స్వప్న సోమనర్సయ్య, పల్లెర్ల వెంకన్న తో పాటు ఆయా కౌన్సిలర్లు తమ గెలుపుకు సహకరించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి నేతృత్వంలో గురువారం హైదరాబాద్ లో ఎంపి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ చామల శాలువలతో నూతన పాలకవర్గాన్ని స్వయంగా సన్మానించారు.

మోత్కూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానని,సీఎం రేవంత్ ఆధీనంలో ఉన్న మున్సిపల్ శాఖ నుంచి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయించి యాదాద్రి జిల్లా లోనే మోత్కూర్ మున్సిపాలిటీ ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి ఆదర్శ మున్సిపాలిటీ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికైన నూతన పాలకవర్గం మున్సిపల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేయాలని ఎంపీ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బీసు శ్రీకాంత్ గౌడ్,కారుపోతుల వెంకన్న గౌడ్, గనగాని శైలజ నర్సయ్య గౌడ్, కూర్మిళ్ల ప్రమీల రాములు,పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి,మొగుళ్ళ అనురాధ, మెంట రమణ నగేష్,నాయకులు పర్రెపాటి యుగందర్, బద్ధం నాగార్జున రెడ్డి,గడ్డం లక్ష్మయ్య,బిక్షం, బీసు సాయి కుమార్, నరేందర్ రెడ్డి, బొల్లెపల్లి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కలిసిన పాలకవర్గం..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని హైదరాబాద్ లో ఆయన నివాసంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి నేతృత్వంలో మోత్కూర్ మున్సిపల్ నూతన పాలకవర్గం స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply